calender_icon.png 6 September, 2025 | 2:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానం

06-09-2025 12:23:03 AM

మంథని, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): మంథని పట్టణంలోని వీధిలోని హనుమాన్ దేవాలయంలో ఉపాధ్యాయుల దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం ఉపాధ్యాయులను రిటైర్డ్ ఇంజనీర్, సామాజిక కార్యకర్త దహగం లింగన్న ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఉపాధ్యాయ వృత్తిలో సేవలందిస్తున్న చిలప్పగారి సునీల్, రామడుగు శ్యామల, దహగం లక్ష్మి, పనకంటి శ్రీకాంత్ నన్ను శాలువాతో సన్మా నించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పడకంటి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు సమాజానికి మార్గదర్శకులని, దేశ ప్రగతిలో విద్యార్థులకు విద్యాబుద్ధులతో పాటు దిశా మార్గదర్శకత్వం ప్రబోధిస్తారన్నారు. ఉపాధ్యాయుల ను గౌరవించడం మన సంప్రదాయమని ప్రతి సంవత్సరం ఉపాధ్యాయులను ఘన ంగా సన్మానించాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొ న్నారు.

ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉపాధ్యాయుడు అవధాని మోహన్ శర్మ, సీనియర్ న్యాయవాది లోకే రాధా కిషన్ రావు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు భూషణ్ కాచే, లోకే మనోహర్, లోకి రమాకాంత్, దహగం శ్రీపాద్, చిలప్పగారి గణేష్, కొంతం మోహన్, పాల్గొన్నారు.