calender_icon.png 16 October, 2025 | 9:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకులాలకు పూర్వవైభవం తీసుకురావాలి

16-10-2025 02:41:00 AM

ఘట్ కేసర్, అక్టోబర్ 15 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ పట్టణంలోని గురుకుల్ విద్యా సంస్థలకు ప్రభుత్వం పూర్వ వైభవాన్ని తీసుకురావాలని  అఖిలపక్ష నాయకులు అభిప్రా యపడ్డారు. గురుకుల్ విద్యాసంస్థలో  జరుగుతున్న పరిణామాలపై బుధవారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈసమావేశానికి వచ్చిన అఖిలపక్ష నాయకులు సింగిరెడ్డి రామిరెడ్డి, బండారి శ్రీనివాస్ గౌడ్, ఏనుగు సుదర్శన్ రెడ్డి, వేముల సంజీవగౌడ్, జేఏసీ కన్వీనర్ మారం లక్ష్మారెడ్డి, రేసు లక్ష్మారెడ్డి పాఠశాల పరిస్థితిని ప్రధానోపాధ్యాయురాలు రజని ని పిలిచి తెలుసు కోవడం జరిగింది.

గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలపై వారు మాట్లాడుతూ ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచిన గురుకుల్ విద్యాసంస్థ దినదినం దీన స్థితికి చేరుకోవడంతో చాలా బాధను కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎండోమెంట్ నుంచి స్వాధీనం చేసుకుని, గురుకుల్ కు పూర్వ వైభవాన్ని తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదన్నారు. పాఠశాలలో సత్వరమే బోధన సిబ్బందిని ప్రభుత్వం ద్వారానా లేక స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా నియమించాల్సిన అవసరం, విద్యార్థుల సంఖ్యలను పెంచాల్సిన అవసరం ఉన్నదన్నారు.

ఘట్ కేసర్ ప్రజలు, పూర్వ విద్యార్థులు, రాజకీయ నాయకులు, యువజన సంఘాలకు సమావేశంలో మనవి చేయడం ఈనెల 19 ఆదివారం  ఉదయం 10 గంటలకు గురుకుల్ మైదానంలో జరిగే గురుకుల్ పరిరక్షణ కార్యాచ రణ సమావేశానికి  హాజరై ఈ విద్యాసంస్థను ఏ విధంగా కాపాడాలి, పూర్వ వైభవా న్ని ఏవిధంగా తీసుకురావాల్సిన అవసరం ఉందని తమ అభిప్రాయాలను తెలియజేయాలని మనవి చేశారు.

ఈకార్యక్రమంలో బిజెపి మున్సిపల్ అధ్యక్షులు కొమ్మిడి మహిపాల్ రెడ్డి, నాయకులు కొమ్మిడి మధుసూ దన్ రెడ్డి, అన్ను బాయ్, సార మురళిగౌడ్, ఎండి నజీర్, దేవరకొండ రాజాచారి, అల్లు కమలాకర్, విక్రాంత్ రెడ్డి, అంజయ్యచారి, రోడ్డ యాదగిరి, కళాశాల ప్రిన్సిపాల్ నారాయణరెడ్డి, ఎండి సిరాజ్ పాల్గొన్నారు.