16-10-2025 08:22:04 AM
టేకులపల్లి, (విజయక్రాంతి): వరల్డ్ సైట్ వారోత్సవాల సందర్భంగా ఏజెన్సీలోని గ్రామాల్లో అంధత్వ నివారణలో భాగంగా పాల్వంచ లోని ఎల్ వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో టేకులపల్లి మండలం తుమ్మల చలక గ్రామంలో కంటి పరీక్షల శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 88 మందిని పరీక్షించి 20 మందికి క్యాటరాక్ట్ ఆపరేషన్లు అవసరమని మిగతా 66 మందికి మెరుగైన చూపు కోసం కళ్ళజోళ్ళు అవసరమని నిర్ధారించారు. వీరందరికీ కూడా ఆపరేషన్లు ఉచితంగా చేయడంతోపాటు కళ్ళజోళ్ళు అవసరమైన వారికి కూడా ఉచితంగా పంపిణీ చేస్తామని క్యాంప్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ దేవిచందర్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో విజన్ సెంటర్ కోఆర్డినేటర్ సాయి తేజ, ఫీల్డ్ ఆఫీసర్ జ్యోతి, విజన్ టెక్నీషియన్లు కల్పన, చైతన్య, ఆ ప్రాంత ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.