calender_icon.png 16 October, 2025 | 12:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దరఖాస్తులు ఆహ్వానం

16-10-2025 08:20:52 AM

మహబూబ్ నగర్ ఫస్ట్ పర్యవేక్షకులు గుండా మనోహర్

మహబూబ్ నగర్ టౌన్: నగరం లో ఫస్ట్ శిక్షణా కేంద్రంలో వివిధ శిక్షణ కోర్సులకు ఇచ్చే ఉచిత నైపుణ్య శిక్షణకు నిరుద్యోగ మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వనిస్తున్నట్లు మహబూబ్ నగర్ ఫస్ట్ పర్యవేక్షకులు గుండా మనోహర్  తెలిపారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తన సొంత నిధులతో నిర్వహిస్తున్న ఈ కేంద్రంలో కంప్యూటర్, బ్యూటీషన్, ఫ్యాషన్ డిజైనింగ్, మగ్గం వర్క్ తో పాటు స్పోకెన్ ఇంగ్లీష్ లలో నైపుణ్య అంశాలపైన  సుశిక్షితులైన శిక్షకుల చేత తర్ఫీదు ఇస్తారని చెప్పారు. ఉచితంగా అందించే ఈ కోర్సు మూడు నెలల పాటు కొనసాగుతుంది అని ఆయన చెప్పారు.  శిక్షణార్థుల ప్రతిభ ఆధారంగా ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని ఆయన చెప్పారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ మహిళా అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.  పూర్తి వివరాలకు మహబూబ్ నగర్ ఫస్ట్ కార్యాలయంలో సంప్రదించాలని ఆయన తెలిపారు.