16-10-2025 08:38:24 AM
పాల్గొన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు
మంథని,(విజయక్రాంతి): సనత్ నగర్ నియోజకవర్గంలో టీపీసీసీ ఉపాధ్యక్షురాలు శ్రీమతి కోట నీలిమ ఆధ్వర్యంలో బ్లాక్-ఏ (బేగంపేట్, రాంగోపాల్పేట్, బన్సిలాల్పేట్) లో "సంఘటన్ శ్రీజన్ అభియాన్"(Sangathan Srijan Abhiyan) సమావేశములో మాజీ కేంద్ర మంత్రి ఏఐసీసీ పరిశీలకులు సీపీ జోషి తో కలిసి పాల్గొన్న సంఘటన్ శ్రీజన్ అభియాన్ పిసిసి పరిశీలకులు నారాయణపేట ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి. పీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు(Duddilla Srinu Babu) పాల్గొన్నారు. సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో "సంఘటన్ శ్రీజన్ అభియాన్” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ అబ్జర్వర్ సీపీ జోషి కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా జరుగుతున్న సంఘటన్ కార్యక్రమాల ప్రాధాన్యతను వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న సంఘటన్ శ్రీజన్ అభియాన్ లో భాగంగా, సికింద్రాబాద్ డీసీసీకి కొత్త అధ్యక్షుల నియామక ప్రక్రియను పూర్తి చేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయబడిందని తెలిపారు.