calender_icon.png 16 October, 2025 | 12:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అత్యవసర చికిత్సపై అవగాహన ఉండాలి

16-10-2025 08:32:30 AM

మెడికవర్ ఆస్పత్రి సెంటర్ హెడ్ కిరణ్ 

మంచిర్యాల, (విజయక్రాంతి): అత్యవసర వైద్యంపై(Emergency Treatment) ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని మెడికవర్ ఆస్పత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ సూచించారు. బుధ వారం కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో  మంచిర్యాల పట్టణంలోని వాగ్దేవి డిగ్రీ కళాశాలలో సిపిఆర్ పై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎవరైనా హార్ట్ ఎటాక్ కు గురైతే అత్యవసర పరిస్థితిలో సిపిఆర్ ఎలా చేయాలనే ఆందోళన ఉంటుందని, ఎలాంటి ఆందోళనకు గురికాకుండా సిపిఆర్ శిక్షణ ద్వారా ప్రాణాలను కాపాడవచ్చునన్నారు. సిపిఆర్ నేర్చుకోవడం వల్ల ఒక మనిషిని ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చని, ప్రతి ఒక్కరూ సిపిఆర్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సిపిఆర్ పై అవగాహన ఉంటే కార్డియాక్ అరెస్ట్ కు గురైన వ్యక్తిని ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రాణాపాయం నుండి కాపాడే అవకాశం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్, బొంగోని హరీష్, శ్రీనివాస్, 130 మంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.