16-10-2025 08:23:32 AM
ఇల్లెందు, (విజయక్రాంతి): సింగరేణి ఇల్లందు ఏరియా సింగరేణి సేవా సమితి సేవా అధ్యక్షురాలు వీసం రమ ఆధ్వర్యంలో సేవ సభ్యులు, ట్రైనర్స్తో 2025 26 సంవత్సరానికి గాను సింగరేణి సంస్థ ఇల్లందు ఏరియా లో సేవా సమితి ఆధ్వర్యంలో వృత్తి విద్యా కోర్సులపై సమీక్ష నిర్వహించారు. ఇల్లందు ఏరియాలో భూనిర్వాసితులకి ఉచిత వృత్తి విద్య కోర్సులు అందరికీ అందేలా చూడాలని వారి అభివృద్ధికి తోడ్పడాలని భూములు కోల్పోయిన వారికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి వారికి ఆర్థికంగా తోడ్పడాలని సేవా అధ్యక్షురాలు అన్నారు. అలాగే భూ నిర్వాసితులు ఉచిత వృత్తి విద్య కోర్సులని నేర్చుకునే ఆర్థికంగా స్థిరపడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి కోఆర్డినేటింగ్ ఆఫీసర్ వి అజయ్, సెవా సెక్రెటరీ ఎల్ సులక్షణ, సేవా మెంబర్స్, సేవా ట్రైనర్స్ తదితరులు పాల్గొన్నారు.