16-10-2025 08:19:08 AM
- ఆర్టీసీ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమం సంఘం ఉమ్మడి జిల్లా గౌరవాధ్యక్షులు దార భాస్కర్
మహబూబ్ నగర్ టౌన్ : అర్టీసీ ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని టీపీసీసీ కోఆర్డినేటర్, ఆర్టీసీ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా గౌరవాధ్యక్షులు దార భాస్కర్ అన్నారు. జిల్లా కేంద్రంలో టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగుల ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సంఘం జిల్లా కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం ఉమ్మడి జిల్లా నూతన గౌరవాధ్యక్షుడిగా దార భాస్కర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో దార భాస్కర్ మాట్లాడుతూ సంఘం సభ్యులకు ఏ సమస్య వచ్చినా పరిష్కరించడానికి అన్ని వేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు. అనంతరం దార భాస్కర్ ను సంఘం ప్రతినిధులు ఘనంగా సన్మానం చేశారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రీజినల్ కార్యదర్శి దార సుందర్, నాయకులు చంద్రయ్య, నర్సింహ్మ, కృష్ణ నాయక్, రామన్న, వెంకటయ్య, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.