07-01-2026 02:02:43 PM
హిల్ట్ విధానం ద్వారా అవినీతి జరగదు
కవిత పార్టీ నడపడం కష్టం
హైదరాబాద్: కవిత(Kavitha resignation) వచ్చి విజ్ఞప్తి చేయడంతో రాజీనామా ఆమోదించానని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutha Sukender Reddy) అన్నారు. గతంలో రాజీనామా పత్రాన్ని కవిత తన సహాయకుడి ద్వారా పంపారని మండలి చైర్మన్ సూచించారు. భావోద్వేగంతో రాజీనామా చేసినప్పుడు కొంత కాలం వేచి చూస్తామని తెలిపారు. కవిత విషయంలో కూడా అదే జరిగిందని గుత్తా సుఖేందర్ వెల్లడించారు. తెలంగాణలో కొత్తగా పార్టీలు పెట్టాల్సిన అంత అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. కొత్తగా పార్టీ వచ్చినా కొనసాగడం కష్టమన్నారు. గతంలో వచ్చిన పలు పార్టీలు కనుమరుగయ్యాయని సూచించారు.
ఏ ప్రాతిపదికన డీలిమిటేషన్(Delimitation) చేపడతారనేది స్పష్టత లేదని చెప్పిన మండలి చైర్మన్ జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతోందన్నారు. ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన హిల్ట్ విధానం ద్వారా ఎలాంటి అవినీతి జరగదని వెల్లడించారు. కాలుష్యం కట్టడికి పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఇద్దరు కార్యదర్శుల వ్యవస్థ ఇక్కడే కాదు.. చాలా రాష్ట్రాల్లో ఉందని వివరించారు. ఎమ్మెల్సీగా తన అభిప్రాయం వ్యక్తం చేశానని.. అందులో తప్పేముందన్నారు. బిల్లులు రాకుంటే సమస్యను లేవనెత్తానని గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తొలగించడం సరికాదని ఆరోపించారు. తదుపరి శాసనసభ సమావేశాలు కొత్త భవనంలో జరుగుతాయని మండలి చైర్మన్ వెల్లడించారు.