26-07-2025 12:00:00 AM
సిద్దిపేట క్రైమ్, జూలై 24 : శారీరకంగా, మానసికంగా బలంగా ఉన్నట్టయితే జీవితంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తినప్పుడు స్థైర్యంగా ఉండొచ్చని సిద్దిపేట అడిషనల్ కమిషనర్ రవీందర్ రెడ్డి అన్నారు. ఈనెల 27న జరిగే మూడవ ఎడిషన్ సిద్ధిపేట హాఫ్ మారథాన్ టీ షర్ట్ లను ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఏసీబీ మాట్లాడుతూ, యువత డ్రగ్స్, గంజాయి, సోషల్ మీడియా వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. ప్రతిరోజు నడక, రన్నింగ్ చేయడం వల్ల వ్యసనాలకు దూరంగా సూచించారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు రంగాచారి, విలేకరులు సంజీవరెడ్డి, శ్రీను, రాజు, తదితరులు పాల్గొన్నారు.