calender_icon.png 7 July, 2025 | 12:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించండి

12-06-2025 01:45:29 AM

సీఎం రేవంత్‌ను డిమాండ్ చేసిన ఎంపీ లక్ష్మణ్ 

హైదరాబాద్, జూన్ 11 (విజయక్రాంతి): కాళేశ్వరం విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్ విమర్శించారు. బుధవారం ఏపీలోని విశాఖపట్నంలో ప్రధాని మోదీ 11 ఏళ్ల పాలనపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కాలేశ్వరం వ్యవహారంలో సీఎం రేవంత్‌రెడ్డికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా కాళేశ్వరం అవినీతి కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.

  కాళేశ్వరంపై బీజేపీ స్పష్టమైన వైఖరితో ఉన్నదని పేర్కొన్నారు.  కమిషన్ విచారణ పేరుతో కాలయాపన అనవసరమని అన్నారు. కాళేశ్వరం పేరుతో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని, అందుకే త్వరగా ఈ కేసును తేల్చి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.