30-10-2025 06:13:51 PM
దైద రవీందర్
నకిరేకల్ (విజయక్రాంతి): అకాల వర్షాల కారణంగా చేనేత కార్మికులు ఉపాధి కోల్పోయిన పరిస్థితి నెలకొన్నదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ పేర్కొన్నారు. గురువారం నకిరేకల్ పట్టణంలోని మూసీ రోడ్డుగల పద్మశాలిని కాలనీలో హ్యాండ్లూమ్ మగ్గాలను ఆయన పరిశీలించి నేత కుటుంబాలను ఓదార్చారు. వర్షాల కారణంగా హ్యాండ్లూమ్ మగ్గాల గుంటలోకి నీరు చేయడంతో నేత కార్మికులు ఉపాధి కోలిపోవడం బాధాకరమన్నారు. నా వంతుగా నేత కార్మికులకు సాయ సహకారాలు అందజేస్తానని ఆయన తెలిపారు.