30-10-2025 06:15:29 PM
నిర్మల్ (విజయక్రాంతి): ఉత్తర తెలంగాణ జిల్లాలోని అతి ప్రాచీనమైన అడెల్లి పోచమ్మ నూతన ఆలయంలో పోచమ్మ విగ్రహాల ప్రతిష్టాపన పూజా కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనాలని నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం అడెల్లి పోచమ్మ సందర్శించుకుని పూజలు నిర్వహించిన అనంతరం ఈనెల ఏడు నుంచి నిర్వహించే వేడుకల నిర్వహణపై పాలక కమిటీ సభ్యులకు అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు.