30-10-2025 08:24:28 PM
దేవరకొండ: మొంథా తుఫాన్ కురిసిన వర్షాలకు నష్టపోయిన ప్రాంతాలను గురువారం దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ సందర్శించారు. కొండమల్లేపల్లి మండల పరిధిలోని గౌరికుంట తండా నల్లకుంటల్లో అతిగా భారీ వర్షాలు కురవడంతో వరి పత్తి పంటలు నష్టం జరగడంతో బాధితులని పరామర్శించి పంట వివరాలు తెలుసుకున్నారు. ఆ తండాల్లో నీటితో మునిగి ఉండడంతో సందర్శించారు. నష్టపోయిన బాధితులకు ఆర్థిక సాయం అందించేలా అధికారులు నివేదిక తయారు చేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం నష్టపోయిన రైతులని, బాధితులని ప్రభుత్వం ఆదుకుంటుందని బాలు నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నాయిని జమున మాధవరెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ ధూదిపాల వేణుధ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు వేమన్ రెడ్డి తదితరులు ఉన్నారు.