30-10-2025 08:06:48 PM
మహమ్మదాబాద్: మండల పరిధిలోని అన్ని గ్రామాలలో భారీ వర్షాల కారణంగా చేతికి వచ్చిన వరి పంట దాదాపుగా 40 ఎకరాలలో వరి పంట నీట మునిగిపోయిందని మండల వ్యవసాయ అధికారి నరేందర్ తెలిపారు. చిన్న సన్నకారి రైతులు ఉన్న ఎకర రెండు ఎకరాలు నీళ్లలో మునిగిపోవడంతో రైతులు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వాటిలిందని, రైతులు వాపోతున్నారు. ప్రభుత్వ పరంగా నష్టపరిహారం ఇస్తే బాగుంటుందని రైతులు కోరుతున్నారు.