calender_icon.png 30 October, 2025 | 10:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెంకటాపూర్ వాసికి డాక్టరేట్

30-10-2025 08:04:53 PM

కోరుట్ల రూరల్ (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన అను మల్ల మహేష్ కు ఉస్మానియా విశ్వవిద్యాలయం మైక్రో బయాలజీ విభాగంలో డాక్టరేట్ పట్టాను ప్రధానం చేసింది. హైదరాబాదులోని సిఎస్ఐఆర్ సిసిఎంబిలో సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ గా పనిచేస్తున్న అనుమల్ల మహేష్ ఉస్మానియా విశ్వవిద్యాలయం మైక్రో బయాలజీ డిపార్ట్మెంటు నుండి డాక్టరేట్ ప్రకటించింది. 

సిఎస్ఐఆర్-ఐఐసిటిలో సైంటిస్ట్ గా పనిచేస్తున్న డాక్టర్ ఆర్ఎస్. ప్రకాశం పర్యవేక్షణలో, ఉస్మానియా నందు మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ శాఖాధిపతి అయినటువంటి ప్రొఫెసర్ బి.బిమా మార్గదర్శకత్వంలో "ఐచిప్ సపోర్టెడ్ ఐసోలేషన్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ నావెల్ తెరాపిటిక్ మైక్రోబ్స్ టు ట్రీట్ హైపర్ యురి సేమియా"  అను అంశంపై పరిశోధనా గ్రంథం సమర్పించినందుకు పరిశోధక విద్యార్థి అయినటువంటి అనుమల్ల మహేష్ కు డాక్టరేట్ ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఆయనను, బంధుమిత్రులు, సహ ఉద్యోగులు, వెంకటాపూర్ వాస్తవ్యులు అభినందించారు.