30-10-2025 08:11:51 PM
బెజ్జూర్ (విజయక్రాంతి): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండల కేంద్రంలోని రైతు వేదిక కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల మంజూరు పత్రాలను సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు లబ్ధిదారులకు అందజేశారు. మండలంలో 63 మంది లబ్ధిదారులకు అధికారులతో కలిసి మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. 8 నెలల్లో లబ్ధిదారులు ఇండ్లు పూర్తిచేసేలా చూసుకోవాలని తెలిపారు. ఆదివాసీలకు ఇల్లు మంజూరు చేయించడం నా బాధ్యత అని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకుంటే మంజూరు చేస్తామని తెలిపారు.
అకాల వర్షంతో పత్తి,వరి పంటలు నష్టం వాటిల్లిందని వారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వంతెనలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వర్షాలు తగ్గుముఖం పట్టాక రోడ్లకు మరమ్మత్తులు చేసేలా కృషి చేస్తానని తెలిపారు. వంతెనలు మంజూరుకు నివేదికలు పంపించామని తెలిపారు. రోడ్డు మరమ్మత్తులు పూర్తి చేశాక గూడెం వరకు బస్సు సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. బాపు గూడ గ్రామానికి వంతెన రోడ్డు నిర్మాణం కోసం భూమి పూజ చేసినట్లు తెలిపారు. ప్రతి గ్రామానికి రెండు సిసి రోడ్లు మంజూరు కోసం కృషి చేస్తానని తెలిపారు. బెజ్జూరు మండలాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ రామ్మోహన్, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, శంకర్ గౌరీ శంకర్ , మాజీ ఎంపీపీ కొప్పుల శంకర్, పార్టీ అధ్యక్షులు జాడి తిరుపతి, వశీవుల్లా ఖాన్, గూడ రాకేష్, బిక్షపతి, సామల తిరుపతి, దిగంబర్ తదితరులు పాల్గొన్నారు.