calender_icon.png 30 October, 2025 | 10:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులు అధైర్య పడవద్దు

30-10-2025 08:14:02 PM

నష్టపోయిన రైతులను అన్ని విధాల ఆదుకుంటాం ఎమ్మెల్యే..

చొప్పదండి (విజయక్రాంతి): చొప్పదండి మండలంలో బుధవారం కురిసిన అకాల వర్షానికి భారీగా పంటలు నష్టపోగా నేడు రుక్మాపూర్ గ్రామంలో నేలకొరిగిన వరి పత్తి మొక్కజొన్న పంటలను స్థానిక నాయకులు, అధికారులతో కలిసి చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం పరిశీలించి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో మాట్లాడి క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేసి నివేదిక అందించాలని కోరారు. అలాగే కొనుగోలు కేంద్రాల్లో తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని ఎటువంటి షరతులు లేకుండా కొనుగోలు చేస్తామని, రైతు పండించిన చివరి గింజ వరకు కొంటామని ఎవరూ అధైర్య పడాల్సిన పని లేదన్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.