30-10-2025 08:10:17 PM
నిర్మల్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని గండి రామన్న సాయిబాబా ఆలయం నుండి మహారాష్ట్రలోని శిరిడి సాయిబాబా ఆలయం వరకు నిర్వహిస్తున్న 11వ పాదయాత్రను అధ్యక్షులు లక్కిలి జగన్మోహన్ రెడ్డి గురువారం ప్రారంభించారు. సాయినామస్మరణతో ఈ పాదయాత్ర ప్రతిరోజు 30 కిలోమీటర్లు నిర్వహించడం జరుగుతుందని సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ లోగో కళ్యాణం కోసం ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.