30-10-2025 05:59:44 PM
పట్టణ ఎస్సై రాజశేఖర్..
మందమర్రి (విజయక్రాంతి): సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని "జాతీయ ఏక్తా దివస్" సందర్భంగా జాతీయ సమైక్యతను చాటిచెప్పే "రన్ ఫర్ యూనిటీ" కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పట్టణ ఎస్సై ఎస్ రాజశేఖర్ తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పోలీస్ విభాగం అధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 2కే రన్ శుక్రవారం ఉదయం 7:00 గం. సింగరేణి గ్రౌండ్ ప్రారంభించి, పాత బస్టాండ్ వరకు నిర్వహించడం జరుగుతుందని, పట్టణ ప్రజలు, యువతీ యువకులు, అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.