calender_icon.png 24 October, 2025 | 2:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాఠశాలను సందర్శించిన జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లేనినా

23-10-2025 09:04:06 PM

మణుగూరు (విజయక్రాంతి): సంతోష్ నగర్ లోని శ్రీ సత్యసాయి ప్రత్యేక అవసరాలు కలిగిన(చెవిటిముగ) పాఠశాలను జిల్లా సంక్షేమ అధికారిణి స్వర్ణలత లేనినా గురువారం సందర్శించారు. పాఠశాలలో విద్యార్థుల సౌకర్యాలు, వసతి, విద్యాబోధనను ఆమె పరిశీలించారు. విద్యార్థులు కళలు, క్రీడలలో చూపిన ప్రతిభ, పురోగతిని సాధించిన అవార్డులను ఉపాధ్యాయుల విద్యా బోధన, స్పీచ్ థెరపీనీ ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా నిర్వాహకులను, ఉపాధ్యాయులను స్వర్ణలత లేనినా ప్రశంసించారు. పాఠశాల అభివృద్ధికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎండిఓ, పాఠశాల నిర్వాహకులు నాగమణి, దుర్గా వరప్రసాద్, ఎంపీఓ వెంకటేశ్వర రావు ఉపాధ్యాయురాలు రోజా రమణి సిబ్బంది పాల్గొన్నారు.