calender_icon.png 24 October, 2025 | 1:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేరాల నియంత్రణ, భద్రతకు సీసీ కెమెరాల ఏర్పాటు ఎంతో అవసరం

23-10-2025 08:49:02 PM

ఎమ్మెల్యే కెపి.వివేకానంద్..

కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): నేరాల నియంత్రణ, భద్రతకు సీసీ కెమెరాల ఏర్పాటు ఎంతో అవసరమని బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 132 - జీడిమెట్ల డివిజన్ దండమూడి ఎంక్లేవ్ లో సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా నేరాల నియంత్రణ, భద్రతకై చేపట్టవలసిన చర్యలపై సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీసీ కెమెరాల ఏర్పాటు, ప్రహరీ గోడ నిర్మాణంతో నేరాల నియంత్రణ జరగడంతో పాటు భద్రత కట్టుదిట్టమవుతుందని, కాలనీలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే స్థానిక పోలీసులకు తెలియజేయాలన్నారు. నేరాల నియంత్రణ విషయంలో కాలనీ వాసుల భాగస్వామ్యం ఎంతో అవసరమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సీఐ విజయ్ వర్ధన్,డిఐ అజయ్ కుమార్,సంక్షేమ సంఘం అధ్యక్షులు కిరణ్ కుమార్,ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్,కోశాధికారి పుప్పాల నాగరాజు,సభ్యులు ఇంద్రా రెడ్డి,సురేష్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.