calender_icon.png 24 October, 2025 | 2:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్లకు కేరాఫ్ కాంగ్రెస్ ప్రభుత్వం..

23-10-2025 08:57:15 PM

కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు..

కరీంనగర్ (విజయక్రాంతి): పేదల సొంత ఇంటి కలను నెరవేరుస్తున్నది దమ్మున్న కాంగ్రెస్ ప్రభుత్వమేననీ, ఇందిరమ్మ ఇండ్లకు కేరాఫ్ కాంగ్రెస్ అని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. గురువారం నగరంలోని కార్ఖానాగడ్డలో కాసారపు వనిత, ప్రవీణ్ దంపతుల ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా రాజేందర్ రావు మాట్లాడుతూ నాడైనా నేడైనా పేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది ఒక కాంగ్రెస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు.

గత బిఆర్ఎస్ పాలకులు పదేళ్ల కాలం పాటు అధికారంలో ఉన్నా ఒక్క ఇంటి నిర్మించలేకపోయారనీ, పేదల ఓట్లను దండుకొని వారిని మోసం చేశారని మండిపడ్డారు. పదేళ్ల కాలం నుంచి పేదలు ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎదురుచూస్తున్నారనీ వారి కలను కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజం చేసి చూపిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కల్లేపల్లి బాలరాజు, గండి శ్యాము, తాండ్ర శంకర్, కాసారపు కిరణ్, గండి గణేష్ గసికంటి కుమార్, జాగిరి సాగర్, నీర్ల ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.