calender_icon.png 24 October, 2025 | 2:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి.. భర్తకు తీవ్ర గాయాలు

23-10-2025 09:46:33 PM

బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం రైతునగర్ గ్రామ రహదారిపై గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నస్రుల్లాబాద్ నెమలి గ్రామానికి చెందిన భార్యాభర్తలు ద్విచక్రవాహనంపై కిష్టాపూర్ కు వెళ్తుండగా రైతు నగర్ వద్ద ఆటో ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. భార్య శకుంతలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే ప్రైవేట్ వాహనంలో బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యలో మృతిచెందినట్లు తెలిపారు. భర్త సాయ గౌడ్ రెండు కాళ్లకు తీవ్రమైన గాయాలు కావడంతో ఆయనను నిజామాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.