23-10-2025 08:51:57 PM
సిద్దిపేట రూరల్: పాఠశాలకు వెళ్తున్న క్రమంలో విద్యార్థి కుక్క కాటుకు గురైన ఘటన మండల పరిధిలోని రాఘవాపూర్ లో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు గ్రామానికి చెందిన గ్యార అరవింద్ ఉదయం పాఠశాలకు వెళ్తున్న క్రమంలో పాఠశాల సమీపం వద్దకు రాగానే కుక్క ఒక్కసారిగా దాడి చేసి చేతి పైభాగంలో కరిచింది. స్థానికులు గమనించి కుక్కను తరిమికొట్టారు. విషయం తెలుసుకున్న తల్లితండ్రులు వైద్యం నిమిత్తం సిద్దిపేటలోని ఆసుపత్రికి తరలించారు.