23-10-2025 09:01:24 PM
నకిరేకల్ (విజయక్రాంతి): శాలిగౌరారం మండలం తుడిమిడి గ్రామానికి చెందిన ప్రముఖ వైద్యులు హైదరాబాద్ లోని పవన్ సాయి హాస్పిటల్ అధినేత డాక్టర్ ఆలేటి శ్రీనివాస్ గౌడ్ మాతృమూర్తి ఆలేటి లింగమ్మ ఇటీవలే అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గురువారం ఆయన స్వగృహంలో లింగమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆలేటి శ్రీనివాస్ గౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఆలేటి శ్రీనివాస్ గౌడ్ కుటుంబ సభ్యులు, బీజేపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.