23-10-2025 09:14:09 PM
అధ్యక్షుడిగా ఎడవెల్లి రఘు వర్ధన్ రెడ్డి..
మేడిపల్లి (విజయక్రాంతి): పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న శ్రీపాద ఎంక్లేవ్ కాలనీ సంక్షేమ సంఘం 2025–27 నూతన సంఘ ఎన్నికలు ఏకగ్రీవంగా పూర్తయ్యాయి. ఏకగ్రీవంగా ఎన్నికైన సంఘం కొత్త కమిటి సభ్యులను కాలనీవాసులు అభినందించారు. ఎన్నికల ఫలితాల ప్రకారం అధ్యక్షుడిగా ఎడవెల్లి రఘువర్ధన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిలుగా టి. కృష్ణా రెడ్డి, పెద్ది రెడ్డి నిర్మల, సలహాదారులుగా ఈ. పూర్ణచంద్ర రావు, ఏ.బీ. కులకర్ణి, ఉపాధ్యక్షులుగా బోడకుంటి శ్రీనివాస్, వంగాల గోపాల్ రెడ్డి, కోశాధికారిగా దూడెం రాజమల్లు, కార్యదర్శులుగా బత్తిని సోమేష్ గౌడ్, వంగాల రజని దేవి, సంయుక్త కార్యదర్శులుగా సందీప్, బత్తిని పావని, ప్రచార కార్యదర్శిగా పెద్దిరెడ్డి సిద్ధిరెడ్డి, కార్యవర్గ సభ్యులుగా ఆరోగ్యం, లింగయ్య, మల్లేష్ గౌడ్, మనోజ్, ఎస్. రాజు, కళ్ళు బ్రహ్మనాయుడు, బోడకుంటి మలతిలను ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు ఎడవెల్లి రఘువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, “కాలనీ అభివృద్ధి, శుభ్రత, భద్రత ప్రధాన అంశాలుగా తీసుకొని సభ్యులందరి సహకారంతో సమిష్టిగా సేవ చేయడానికి కట్టుబడి ఉన్నాం” అని తెలిపారు. కాలనీలో సాధారణ ఎన్నికలు అవసరం లేకుండా ప్రతి సారి ఏకగ్రీవంగా జరగడం, నివాసుల ఐక్యతకు, అభివృద్ధిపట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనమని ఆయన అన్నారు.