calender_icon.png 24 October, 2025 | 2:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయండి

23-10-2025 09:43:14 PM

నిర్మల్ (విజయక్రాంతి): జిల్లాలో వివిధ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ శాఖల ఆధ్వర్యంలో నిర్మాణంలో ఉన్న పనులన్నీ ఎప్పటికప్పుడు పూర్తి చేస్తూ ఉండాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. గురువారం రాత్రి కలెక్టరేట్లోని తన చాంబర్లో జిల్లాలో నిర్మాణంలో ఉన్న పనుల పురోగతిపై వివిధ శాఖల ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వివిధ మండలాల్లో నిర్మాణంలో ఉన్న పనులను గురించి వివరాలను ఆయా శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు.

చేపట్టిన పనులు, పనుల పురోగతి, పూర్తి చేయడానికి ఉన్న గడువు, తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణంలో ఉన్న పనులను ఎప్పటికప్పుడు సంబంధిత శాఖల అధికారులు అంతా పర్యవేక్షిస్తూ ఉండాలని సూచించారు. పనులన్నీ నిర్ణిత గడువులోగా, నాణ్యవంతంగా పూర్తి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో సీపీఓ జీవరత్నం, వివిధ శాఖల ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ అధికారులు సందీప్, వేణుగోపాల్ సునీల్ కుమార్, గంగాధర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.