calender_icon.png 24 October, 2025 | 1:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలు కోరుకుంటే తప్పకుండా రాజకీయ పార్టీ పెడతా

23-10-2025 08:46:11 PM

పార్టీ పెడితే నాకు కాదు ప్రజలకు మేలు జరగాలి

ప్రజాభిప్రాయం ఏంటో తెలుసుకోవటానికే 'జనం బాట' కార్యక్రమం

ఈ నెల 25 నుంచి 4 నెలల పాటు 'జనం బాట'

అన్ని వర్గాలను కలిసి వారి సమస్యలు తెలుసుకుంటాం

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న కల్వకుంట్ల కవిత

యాదగిరిగుట్ట (విజయక్రాంతి): యాదాద్రి లక్ష్మీ నరసింహా స్వామిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) దర్శించుకున్నారు. 'జనం బాట' కార్యక్రమానికి లక్ష్మీ నరసింహాస్వామి ఆశీస్సుల కోసమే వచ్చామని వెల్లడించారు. యాదాద్రి లక్ష్మీనరసింహా స్వామిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున జాగృతి నేతలమంతా వచ్చామని, మొన్న తిరుపతి, ఇప్పుడు యాదాద్రి దేవాలయాలను దర్శించుకున్నామని, ఈ నెల 25 నుంచి చేపట్టనున్న 'జనం బాట' కార్యక్రమానికి ఎలాంటి అవాంతారాలు రాకుండా చూడాలని స్వామి వారిని కోరుకున్నామని, ప్రజా సమస్యలను అర్థం చేసుకునే శక్తి ఇవ్వాలనే దైవదర్శనం చేసుకుంటున్నామని, ఈ నెల 25 నుంచి మా సొంత ఊరు నిజామాబాద్ నుంచి 'జనం బాట' కార్యక్రమం మొదలవుతుంది అని తెలిపారు. 33 జిల్లాల్లో 4 నెలలు పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని, ప్రతి జిల్లాలో 2 రోజుల పాటు ఉండి అక్కడి సమస్యలు తెలుసుకుంటామని తెలిపారు. 

మేధావులు, విద్యావంతులు, రైతులు, యువత, మహిళలు ఇలా అన్ని వర్గాలను కలుస్తామని ,వారు చెప్పే సమస్యలను అర్థం చేసుకొని... వాటిని ఏ విధంగా పరిష్కారం చేయాలన్న దానిపై దృష్టి పెడతామని తెలిపారు. ప్రజలతో కూలంకషంగా మాట్లాడేందుకు జాగృతికి ఈ కార్యక్రమం వేదికగా మారనుందనీ చెప్పారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ యాదాద్రిని చక్కగా పునర్నిర్మించారు. యాదాద్రి ప్రాశ్యస్తాన్ని కాపాడే విధంగా ఇప్పుడున్న ప్రభుత్వం ప్రయత్నం చేయాలనీ, మేము వస్తుంటే విచిత్రమైన హోర్డింగ్ లను చూశాం. అలా కాకుండా తిరుమలలో మాదిరిగా స్వామి వారి హోర్డింగ్ లు చిత్రపటలే ఇక్కడ ఉండేలా చూడాలనీ చెప్పారు. మళ్లీ యాదాద్రికి వస్తాం. అప్పుడు ఇక్కడున్న అన్ని సమస్యలపై వివరంగా మాట్లాడతామని, తెలంగాణ జాగృతి ఎన్జీవో గా పుట్టి 19 ఏళ్లుగా కొనసాగుతోందనీ, ప్రజా సమస్యలతో పాటు రాజకీయ అంశాలను కూడా గతంలో మేము మాట్లాడాం అని చెప్పారు. 

తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా రాజకీయాలు, రాజకీయ సమీకరణాలు మాట్లాడటం జరిగిందనీ, సివిల్ సోసైటీ సంస్థ అయినప్పటికీ అవసరమైతే రాజకీయాలు పుష్కలంగా మాట్లాడతామని గుర్తుచేశారు. రాజకీయాలు మాట్లాడాలంటే రాజకీయ పార్టీగానే ఉండాల్సిన అవసరం లేదనీ, పార్టీ రావాలని ప్రజలు కోరుకుంటే తప్పకుండా వస్తాం. అందులో ఇబ్బందేమీ లేదనీ, ఏపీలో మూడు, తమిళనాడులో రెండు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. కేరళలో గల్లీకి ఒక పార్టీ ఉందనీ చెప్పరు. పార్టీలు ఉండటం పెద్ద విషయం కాదు. వాటి వల్ల ప్రజలకు మేలు జరగాలనీ, నేను పార్టీ పెడితే నాకు లాభం కాదు. ప్రజలకు మేలు జరిగేందుకు ప్రయత్నిస్తానీ హామీ ఇచ్చారు. ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుసుకునేందుకు 'జనం బాట' ద్వారా వారిని కలిసేందుకు వెళ్తున్నామని చెప్పారు.