23-10-2025 08:59:24 PM
మణుగూరు (విజయక్రాంతి): మున్సిపాలిటీ పరిధిలోని శివలింగాపురంలో గల బాలల సదనాన్ని మణుగూరు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కంబపు సూరిరెడ్డి గురువారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందుతున్న భోజనం వసతులు గూర్చి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల పరిసర ప్రాంతాలను పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. పాఠశాల పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచి విద్యార్థులకు నాణ్యమైన భోజనం, విద్య అందించాలని సూచించారు. న్యాయమూర్తి వెంట న్యాయవాదులు చిర్రా సరస్వతి, వీరంకి పద్మావ తి, చిర్రా రవి, గద్దల సాంబశివరావు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.