06-09-2025 12:21:32 AM
ఎర్రుపాలెం, సెప్టెంబర్ 5 ( విజయ క్రాంతి): మండల కేంద్రమైన ఎస్ జె కే యం కళాశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు. ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కళాశాల డైరెక్టర్ డి సత్యనారాయణ రెడ్డి విద్యార్థుల ఉద్దేశించి మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు నాడు ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకోవడం మన అందరి అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు.
సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయ వృత్తికి, దేశానికి ఎనలేని సేవలను చేశారని కొనియాడారు. ఉపరాష్ట్రపతి పదవికి, రాష్ట్రపతి పదవికి, ఉపాధ్యాయ వృత్తికి, దేశ రాయబారిగా, వివిధ యూనివర్సిటీలకు ఛాన్స్లర్గా గా ఏ పదవి చేపట్టిన ఆ పదవికి వన్నె తెచ్చిన వ్యక్తిని పేర్కొన్నారు. విద్యార్థులందరూ మంచిగా చదువుకొని సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆశయాలను కొనసాగించి ఉత్తమ పౌరులుగా సమాజానికి సేవ చేయాలని పేర్కొన్నారు.
చెడు అలవాట్లను విడనాడి , మంచిని అలవర్చుకోవాలని విద్యార్థులు ఉద్దేశించి పేర్కొన్నారు. తదనంతర కార్యక్రమంలో కళాశాలలో పనిచేసే అధ్యాపకులను సత్యనారాయణ రెడ్డి శాలువాలు తో సత్కరించారు.ఈ కార్యక్రమంలో కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ నాగిరెడ్డి సౌజన్య, సీనియర్ అద్యాపకులు మిరియాల శ్యాం ప్రసాద్, ఏ శ్రీనివాస్ రెడ్డి, ఎన్ బాబురావు, జి శ్రీనివాసరావు, జి సత్యనారాయణ, విద్యార్థులు పాల్గొన్నారు.