09-10-2025 12:13:00 AM
తెలుగు చిత్రసీమలో అనతికాలంలోనే స్టార్ డైరెక్టర్‌గా ఎదిగిన వాళ్లలో వీవీ వినాయక్ ఒకరు. ఆయన పూర్తి పేరు గండ్రోతు వీర వేంకట వినాయక రావు. 1974, అక్టోబర్ 9న జన్మించిన ఆయన గురువారంతో 51వ పడిలో అడుగుపెడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు గ్రామం ఆయన స్వస్థలం. 2002లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘ఆది’ చిత్రానికి తొలిసారి దర్శకుడిగా పనిచేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించటంతోపాటు వీవీ వినాయక్‌కు ఉత్తమ పరిచయ దర్శకుడిగా నంది పురస్కారాన్ని తెచ్చిపెట్టింది. 2003లో నితిన్‌ను హీరోగా పెట్టి ‘దిల్’ రూపొందించి మరో హిట్‌ను అందుకున్నారు. చిరంజీవితో ఠాగూర్, ఖైదీ నెంబర్ 150, ప్రభాస్‌తో యోగి, రామ్‌చరణ్‌తో నాయక్, జూ.ఎన్టీఆర్‌తో సాంబ, అదుర్స్, అల్లు అర్జున్‌తో బన్నీ, బద్రినాథ్ వంటి ఎన్నో సినిమాలు ఈయన దర్శకత్వంలో రూపుదిద్దుకున్నవే.