calender_icon.png 11 October, 2025 | 3:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కమిటీ కుర్రోళ్లు కాంబో రిపీట్

09-10-2025 12:09:48 AM

గత ఏడాది చిన్న చిత్రంగా విడుదలై భారీ హిట్ సాధించిన ‘కమిటీ కుర్రోళ్లు’ కాంబో మరోసారి రిపీట్ కానుంది. యంగ్ డైరెక్టర్ యదు వంశీ మరోసారి నిహారిక కొణిదెలతో చేతులు కలిపారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై మరో సినిమాను రూపొందించటానికి చర్చలు జరుపుతున్నారు. ఈ సినిమా 2026లో సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం. సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి మానసశర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర కథను మానసశర్మ అందించగా స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌ను మానసశర్మ, మహేశ్ ఉప్పాల అందించారు. ఫాంటసీ, కామెడీ జోనర్ తెరెకెక్కనున్న ఈ చిత్రానికి  అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్నారు.