calender_icon.png 11 October, 2025 | 4:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పుణెలో గీతాలాపన

09-10-2025 12:13:46 AM

రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న యాక్షన్ డ్రామా చిత్రం ‘పెద్ది’. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వృద్ధి సినిమాస్ బ్యానరపై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. జాన్వీకపూర్ కథానాయి కగా నటిస్తున్న ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ ఓ శక్తిమంతమైన పాత్ర పోషిస్తున్నారు. జగపతిబాబు, దివ్యేందు శర్మ కీలక పాత్ర ల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోంది.

మరోవైపు పోస్ట్-ప్రొడక్షన్ పనులు కూడా కొనసాగుతున్నాయి. షెడ్యూల్ ప్రకారం సినిమా పూర్తయ్యేలా టీమ్ ముందుకు సాగుతోంది. గురువారం తాజా షెడ్యూల్‌ను పుణెలో ప్రారంభించనుంది. ఈ షెడ్యూల్‌లో రామ్‌చరణ్, జాన్వీపై పాటను చిత్రీకరించను న్నారు. రెహమాన్ స్వరాలు సమకూర్చిన ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ పాట విజువల్ ట్రీట్‌గా ఉండనుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా 2026, మార్చి 27న విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహమాన్; డీవోపీ: ఆర్ రత్నవేలు; ప్రొడక్షన్ డిజైన్: అవినాష్; ఎడిటర్: నవీన్ నూలి.