29-10-2025 12:57:07 AM
అడివి శేష్ హీరోగా నటిస్తున్న సినిమా ‘డకాయిట్’. ప్రేమ-ప్రతీకార కథనం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రా నికి షానియల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ దర్శక, నటుడు అనురాగ్ కశ్యప్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆయ న నటిస్తున్న తొలి తెలుగు చిత్రం ఇదే కావడం విశేషం. మేకర్స్ తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ అప్డేట్ ఇచ్చారు.
ఉగాది పర్వది నం కానుకగా 2026, మార్చి 19న ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు విడుదల చేసిన రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ ఇంటెన్స్ లుక్స్ అదిరిపోయింది. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సుప్రియ యార్లగడ్డ నిర్మాత కాగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.