06-09-2025 12:00:00 AM
బాన్సువాడ, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి) : మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా మిలాద్ ఉన్ నబి పండుగ వేడుకలను శుక్రవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో మైనార్టీ సోదరులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా బాన్సువాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీలోని జిమ్మ బిలాల్ మసీదులో మైనార్టీ సోదరులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు మహమ్మద్ గౌస్ మాట్లాడుతూ మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు, మహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్ర జీవనశైలి గురించి వివరించారు. ప్రవక్త సర్వ మానవాళి శాంతితో ఉండాలని సందేశం ఇచ్చారని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరు మహ్మద్ ప్రవర్త చూపిన బాటలోనే నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సోదరులు తదితరులు పాల్గొన్నారు.
పెద్ద కొడప్గల్‌లో..
పెద్ద కొడప్గల్, సెప్టెంబర్ 5 (విజయ క్రాంతి): ఈద్ మిలాద్ ఉన్ నబీ మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా మిలాద్ ఉన్ నబి పండుగ వేడుకలను శుక్రవారం కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ లో మైనార్టీ సోదరులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలోని జామా మజీద్ లో మైనార్టీ సోదరులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు.
ఈ సందర్భంగా జామ మస్జిద్ ఇమామ్ మాట్లాడుతూ ఈద్ మిలాద్ ఉన్ నబీ ఇది ఇస్లాం మతంలో ఒక ముఖ్యమైన పండుగ ప్రవక్త మహమ్మద్ పుట్టినరోజు జ్ఞాపకార్థం దీనిని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారని ఇస్లాం మాసంలోనీ రబ్బిల్ అవ్వల్ నెలలో 12వ రోజున వచ్చే ఈ పండుగ ప్రవక్త బోధించిన శాంతి దయా కరుణ ఐక్యత వంటి గొప్ప విలువలను గుర్తు చేస్తుందని పండుగను కుటుంబ సభ్యులు స్నేహితులు ఆత్మీయులతో పంచుకోవడానికి ప్రవక్త బోధనలు ప్రేమ సహనం శాంతి ధర్మ మార్గంలో నడిపిస్తాయని మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు, మహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్ర జీవనశైలి గురించి వివరించారు.
ప్రవక్త సర్వ మానవాళి శాంతితో ఉండాలని సందేశం ఇచ్చారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు మహ్మద్ ప్రవర్త చూపిన బాటలోనే నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ముఫ్తీ ఫారూఖ్ , జామ మస్జిద్ ఇమామ్ అబూ హాసన్,మైనారిటీ కమిటీ సభ్యుడు ఎస్ డి రషీద్ , ఎస్.కె మొహమ్మద్ , ఎస్.కె ఖాసిం , మహమ్మద్ గౌస్ , అహ్మద్ షా, సయ్యద్ అతిక్ , మహమ్మద్ గౌస్, ఎస్డి పాషా, సంధాని, షేక్ అలీ , కమిటీ సభ్యులు మైనారిటీ సోదరు లు, తదితరులు పాల్గొన్నారు.