06-09-2025 12:00:00 AM
బాన్సువాడ, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలో నీ తెలంగాణ తిరుమల తిరుపతి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే, బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి దంపతులు తెలంగాణ తిరుమల దేవస్థానంలో నిర్వహించిన. శ్రీదేవి భూదేవి వేంకటేశ్వరస్వామి అమ్మ వారిల కల్యాణ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్ దంపతులు పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు పొందారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మాసాని శ్రీనివాస్ రెడ్డి, గణేష్, నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, వివిధ మండలాల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.