calender_icon.png 6 September, 2025 | 3:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

06-09-2025 12:00:00 AM

బాన్సువాడ, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి) ః నసురుల్లాబాద్ మండలంలోని గిరిజన గురుకుల విద్యాలయంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు రాధాకృష్ణన్ చేసిన కృషి గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఇస్లావత్ మాధవరావు, ఉపాధ్యాయులు సంపత్ కుమార్, బాబు, లెక్చరర్ బాలేష్, పీడీ అశ్విన్, ఉపాధ్యాయేతర సిబ్బంది చరణ్ సింగ్, మనోహర్ పాల్గొన్నారు.

ఉపాధ్యాయులను సన్మానించిన కాంగ్రెస్ నాయకుడు మహమ్మద్ గౌస్...

ఉపాధ్యాయుల దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని టీచర్స్ కాలనీకి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు మహమ్మద్ గౌస్  ఉపాధ్యాయుల దినోత్సవం అదేవిధంగా ఉపాధ్యాయుల కాలనీ కావడంతో ఉపాధ్యాయులు దాసరి రవి, సాయిరాం లను శాలువ పూలమాలతో ఘనంగా సత్కరించారు. యువకులు మహబూబ్ యూనుస్ రాహుల్ నితిన్ రెడ్డి నితీష్ రిష్ సంతు పాల్గొన్నారు.

ఆర్య క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో అధ్యాపకునికి సన్మానం.. 

కామారెడ్డి, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి) ః ఆర్య క్షత్రియ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కామారెడ్డి పట్టణ పరిధిలో దేవునిపల్లి ఆర్య క్షత్రియ సంఘం భవనంలో ఉత్తమ అధ్యాపకుడు బలవంతరావును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు కిషన్ రావు, మాజీ జెడ్పిటిసి తానాజీరావు, రాజేశ్వరరావు, ఆనంద్ రావు, ఆర్య క్షత్రియ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు, హరికిషన్ రావ్, తదితరులు పాల్గొన్నారు.