05-12-2025 12:42:42 AM
ఆదిలాబాద్, డిసెంబర్ 4 (విజయక్రాంతి): సభలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డిపై ప్రశంస జల్లు కురిపించారు. జిల్లాలో 700 ఎకరాల్లో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు భూ సేకరణ జీవో జారీ చేయడం సంతోషంగా ఉన్నదని తెలిపారు. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటుతో జిల్లాలోని విద్యార్థులకు సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్య అందుతుందని పేర్కొన్నారు.
పొలం బాట కార్యక్రమంలో భాగంగా రూ.40 కోట్లు మంజూరు చేసి ఆదిలాబాద్ నుంచి కార్యక్రమాన్ని ప్రారంభించాలని, రైతులు తమ పొలాలకు వెళ్లే విధంగా సౌకర్యాలు కల్పించాలని కోరారు. 30 సంవత్సరాలుగా జిల్లాలో మూసి ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీని నిరుద్యోగ యువతకు ఉపాధి కోసం తెరవాలని, చనాక కొరాట ప్రాజెక్ట్ పనులు 95 శాతం పూర్తయ్యాయని, మిగిలిన భూసేకరణ పనులు పూర్తి చేస్తే దాదాపు 65 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందన్నారు.
ఆదిలాబాద్ పట్టణంలోని కుమ్రం భీం ఆదివాసీ కాలనీలో గుడిసెలలో నివసిస్తున్న 2 వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇ వ్వాలని, జైనథ్‌లోని లక్ష్మీనారాయణ ఆలయం, బేల మండలంలో సదల్పూర్‌లో బైరాన్ దేవ్ శివుని ఆలయ అభివృద్ధికి ప్రతే ్యక నిధులు జారీ చేయాలని, రైతులను ఆదుకోవాలని, జొన్న పంటను కొనుగోలు చేయాలని కోరారు.
ఆదిలాబాద్ అభివృద్ధికి కృషి: మంత్రి జూపల్లి
ఆదిలాబాద్ జిల్లాలో విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నాణ్యమైన విద్యను అందించేందుకు రూ.200 కోట్ల రూపాయల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.
గత సంవత్సరం పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 10 వేల రూపాయల చొప్పున నష్టపరిహారం అందించామన్నారు. ఈ సంవత్సరం జరిగిన నష్టంపై చర్యలు తీసుకుని రైతు సంక్షేమానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఎంపీ గోడం నగేష్ మా ట్లాడుతూ.. ఆదిలాబాద్ జిల్లా సామాజిక, భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని సీఎంను కోరారు.