calender_icon.png 5 December, 2025 | 1:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్థిక నేరాలపై పోలీసుల ప్రత్యేక దృష్టి

05-12-2025 12:43:39 AM

  1. రాష్ట్రంలో శాంతి భద్రతల పర్యవేక్షణ పోలీస్ శాఖ లక్ష్యం
  2. రాష్ట్ర డీజీపీ బి.శివధర్‌రెడ్డి

నిర్మల్, డిసెంబర్ ౪ (విజయక్రాంతి): తెలంగాణ పోలీస్ దేశానికి రోల్ మోడల్‌గా పనిచేస్తుందని రాష్ట్రంలో ఆర్థిక నేరాలతో పాటు శాంతి భద్రతల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు రాష్ట్ర డిజిపి బి శివధర్ రెడ్డి అన్నారు. గురువారం నిర్మల్ జిల్లా కేంద్రం లో రూ.13 కోట్లతో నిర్మించిన పోలీస్ క్వార్టర్లలను ప్రారంభించి, రూ.3.50 కోట్లతో నిర్మించే ఎస్పీ క్యాంప్ కార్యాలయానికి నిర్మ ల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, కలెక్టర్ అభిలాష అభినవ్, డిఐజి రమేష్‌రెడ్డి, ఎస్పీ జానకి ల తో కలిసి భూమి పూజ నిర్వహించారు. రాష్ట్రంలో తెలంగాణ పోలీస్ వినూత్న సంస్కరణలతో ముందుకు పోతుందన్నారు.

శాంతి భద్రతల పర్యవేక్షణ ఆర్థిక నేరాలు నియంత్రణ సైబర్ నేరాల అడ్డుకట్టు చట్ట వ్యతిరేక కార్యక్రమాలపై ప్రధానంగా దృష్టి పెట్టడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీ స్ వ్యవస్థను ప్రజలతో కలిసి పని చేయడం జరుగుతుందని తెలిపారు. పోలీసు ఉద్యోగుల సంక్షేమంపై కూడా దృష్టి పెట్టడం జరి గిందన్నారు. నూతనంగా నిర్మించిన ఈ ఆధునిక భవనాలు పోలీసు సిబ్బందికి మెరుగైన పనిస్థలం, నివాస వాతావరణం అందిం చడమే కాకుండా, జిల్లాలో సేవల నాణ్యతను పెంచేందుకు దోహదపడతాయన్నారు.

నిర్మ ల్ పోలీసింగ్ రాష్ట్రంలో ఆదర్శంగా నిలవాలని, ప్రజా సేవలో మరింత నిబద్ధతతో పని చేయాలని అన్ని స్థాయి అధికారులను డీజీ పీ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మె ల్యే మహేశ్వర్‌రెడ్డి, కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల, ఐజి రమేష్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ ఫైజాన్‌అహ్మద్ ఏఎస్‌పీ రాజేష్ మీ, ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు.