05-11-2025 07:01:42 PM
హైదరాబాద్: తెలంగాణ మంత్రి మండలిలో ఇటీవలే చోటు దక్కించుకున్న మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ బుధవారం తనకు కేటాయించిన మైనారిటీ సంక్షేమం, ప్రభుత్వ సంస్థల శాఖల పట్ల సంతోషంగా ఉన్నానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అజారుద్దీన్ మాట్లాడుతూ... మంత్రిగా తన కొత్త బాధ్యతలో తన వంతు కృషి చేస్తానని, కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ మైనారిటీలు, ముస్లింల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. కొంతమంది ఇప్పటివరకు తెలంగాణ కేబినెట్‌లో మైనారిటీ మంత్రులు లేరని అంటున్నారు. కానీ, 11-12 మంది ముస్లిం చైర్‌పర్సన్‌లు ఉన్నట్లు ప్రతిపక్షలకు తెలియదనుకుంటా అని ఆయన ఎద్దేవా చేశారు. తనను మంత్రివర్గంలోకి తీసుకోవడం, తనకు కేటాయించిన మంత్రిత్వ శాఖలపై బీఆర్ఎస్, బీజేపీ విమర్శలను తోసిపుచ్చుతూ, అది ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రత్యేక హక్కు అన్నారు. మైనారిటీలు, అణగారిన వర్గాల సంక్షేమం కోసం తను కష్టపడి పనిచేయాలనుకుంటున్నాను" అని అజారుద్దీన్ తెలిపారు.