calender_icon.png 15 August, 2025 | 9:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ

15-08-2025 12:41:51 AM

బాన్సువాడ, ఆగస్టు14 (విజయ క్రాంతి): 79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా  దేశ ప్రధాని నరేంద్ర మోడీ  పిలుపుమేరకు గురువారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రతి ఇంటిపైన జాతీయ జెండా నీ కట్టి దేశభక్తిని చాటుకోవాలని దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు ఇవ్వడం జరిగిందనీ నాయకులు పేర్కొన్నారు. బిజెపి బాన్సువాడ శాఖ ఆధ్వర్యంలో ఇంటి ఇంటికి.

షాపు లలో జాతీయ జండాలు పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమంలో  బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ, జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్, అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్, మోహన్ రెడ్డి, బిజెపి పట్టణ అధ్యక్షుడు కోణాల గంగారెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి చిరంజీవి, ఉమేష్ పట్టణ ఉపాధ్యక్షుడు గజన మహేష్, సిద్ది బాల్రాజ్, రామకృష్ణ, పట్టణ కార్యదర్శి సాయి,ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులు చీకటరాజు, సోషల్ మీడియా అసెంబ్లీ కన్వీనర్ శంకర్, బిజెపి నాయకులు అశ్విన్, విశాల్, సురేష్, దత్తు, నాగరాజు, బాలు, సుధాకర్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

తాడ్వాయిలో..

తాడ్వాయి,ఆగష్టు, 14( విజయ క్రాంతి), కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో గురువారం బిజెపి నాయకులు తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి కామారెడ్డి రోడ్డుపై జాతీయ జెండాలు చేతులో పట్టుకుని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు పైడి ఎల్లారెడ్డి, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్ రావు, ఎల్లారెడ్డి అసెంబ్లీ కన్వీనర్ లింగారావు, రాష్ట్ర ఆర్టికల్చర్ కన్వీనర్ గంగారెడ్డి, మండల అధ్యక్షులు సంతోష్ రెడ్డి, నాయకులు తిరుపతిరెడ్డి, హోటల్ శ్రీను,వెంకట్రావు, రాజిరెడ్డి, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.