calender_icon.png 15 August, 2025 | 3:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదరికానికి భరోసా వెదిరే పూలమ్మ ఫౌండేషన్

15-08-2025 01:33:54 AM

  1. అనునిత్యం గ్రామ అభివృద్ధి కోసం తపన 
  2. సమాజ సేవలో ముందున్న వెదిరే.. బ్రదర్స్.. 
  3. ఫౌండేషన్ సేవలను ఆపదలో ఉన్నవారికి నిరంతరంగా కొనసాగిస్తాం 
  4. ఫౌండేషన్ చైర్మన్ వెదిరే మెగా రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, విజేందర్ రెడ్డి

మునుగోడు, ఆగస్టు 14 ( విజయ క్రాంతి): నవ సామాజిక వేత్తగా ఈ సమాజంలో పేదరికంతో బాధ పడుతున్న వారిని, ఆకలితో అలమటిస్తున్న వారిని, అనాధలని, తల్లిదండ్రులు లేని పిల్లలని అక్కున చేర్చుకొని నేనున్నానంటూ భరోసా ఇస్తూ వారికి వెన్నుదన్నుగా ఉంటూ పేదల పక్షపాతిగా ఉంటూ ఎన్నో సేవ కార్యక్రమాలు గ్రామంలో చేస్తూ, ఊరిలో ఎవరు ఆపదలో ఉన్నా  ఆదుకుంటున్నారు వారు చేస్తున్న సేవలకు ఎందరివో ప్రశంసలు పొందారు.

గ్రామంలో ఏ పేదవాడికి ఆపద వచ్చిన మేమున్నామంటూ ముందుకు వచ్చి భరో సా ఇస్తూ బాధ్యత తీసుకుంటున్న నల్గొండ జిల్లా, మునుగోడు మండలం, కొంపల్లి గ్రామం వెదిరే మధుసూదన్ రెడ్డి ,పూలమ్మ దంపతుల కుమారులు వెదిరే పూలమ్మ ఫౌండేషన్ చైర్మన్ మేఘ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి శివాలయం గుడి చైర్మన్ విజేందర్ రెడ్డి. వెదిరే పూలమ్మ పౌండేషన్ వారి అమ్మవారి జ్ఞాపకార్థంతో వారి శక్తి మేరకు  సహాయం చేస్తూ, పేదవారి కష్టాలను  తీరుస్తూ ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటున్నారు.

గ్రామంలో నిరుపేద లకు ఆర్థిక సాయం చేస్తున్నారు, కుటుంబంలో ఎవరైనా చనిపోతే వారి కుటుంబాలకు, అనారోగ్యంతో ఉన్నవారికి హాస్పిటల్లో ఖర్చులు భరించలేని వారికి కూడా మేమున్నామని ఆధైర్య పడొద్దు అంటూ ఆర్థిక సాయం చేస్తున్నారు.గ్రామ దేవత గుడి ఉండాలి అని ముత్యాలమ్మ గుడి నిర్మాణానికి ఏడు లక్షలు సహాయం చేసినారు. గ్రామంలో పేదింటి ఆడ పిల్లల పెళ్లిళ్లకు లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నారు.

మేము చదివిన స్కూలుకు ఏదో ఒకటి చేయాలనే దృడ సంకల్పంతో ప్రైమరీ స్కూల్ ప్రహరీ గోడ కొరకు 40,000/- ఆర్థిక సాయం,  హై స్కూల్ స్టేజి నిర్మాణం కొరకు ఫుట్బాల్, వాలీబాల్ కోర్టు మరియు రన్నింగ్ ట్రాక్  కొరకు 5 లక్షల రూపాయలు ఖర్చు చేసి పాఠశాలను అభివృద్ధి చేసినారు.జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు బోధించడానికి ఉపాధ్యాయురాలు లేకపోతే తమ సొంత నిధులతో ఒక విద్యా వాలంటీర్నీ  నియమించి ఆ సదరు విద్యా వాలంటీర్ కి నెలకు 15వేల రూపాయల చొప్పున 6 నెలలకు గాను 90 వేల జీతం  ఫౌండేషన్ ద్వారా ఇస్తున్నారు.