calender_icon.png 15 August, 2025 | 3:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు యూరియా కష్టాలు

15-08-2025 01:32:17 AM

  1. విక్రయ కేంద్రాల వద్ద బారులు

వానలో తడుస్తూ ఇబ్బందులు

క్యూలో చెప్పులు పెడుతున్న అన్నదాతలు

మార్పు ఇదేనా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న రైతులు

మహబూబాబాద్, ఆగస్టు 14 (విజయక్రాంతి)/హుజూరాబాద్: యూరియా కొరత తో రైతుల కష్టాలు రెట్టింపవుతున్నాయి. పీఏసీఎస్‌లు, విక్రయ దుకాణాల్లో దిగుమతి చేసేంత సమయం కూడా అమ్మకానికి పట్టడం లేదు. స్టాకు వచ్చిందని తెలుసుకుని ఆశతో వెళ్తున్న రైతులకు అక్కడికి వెళ్లిన కొద్దిసేపటికే యూరియా అయిపోయిందని సమాధానం చెబుతుండటంతో నిరుత్సాహపడుతున్నారు.

మార్పు అంటే ఇదేనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులను కష్టపెట్టేందుకె నా కాంగ్రెస్ ను గెలిపించుకుంది అని రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా గురువారం ఎరువుల షాపుల వద్ద రైతులు బారులు తీరారు. స్టాక్ వచ్చిందని తెలిసి పరుగులు పెట్టిన రైతులకు స్టాక్ అంతా అయిపోయిందని షాపు యజమానులను చెప్పడంతో రైతులు తిరిగి ప్రశ్నించడం చాలా చోట్ల కనిపించింది. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్నంపల్లిలో గురువారం తెల్లవారకముందే యూరియా కోసం రైతులు బారులు తీరారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో యూరియా కోసం క్యూ లో రైతులు చెప్పులు పెట్టారు. 

అప్పుగా యూరియా బస్తాలు

సాగుకు పెట్టుబడి కోసం అప్పుగా డబ్బు లు తీసుకోవడం సర్వసాధారణం. అయితే ఇప్పుడు అందుకు భిన్నంగా రైతులు యూరి యా కోసం తమకు తెలిసిన వారి దగ్గర అ ప్పు ఇవ్వమంటూ అడిగి తెచ్చుకుంటున్నా రు. మహబూబాబాద్ జిల్లాలో వరి సాగు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.

ఈ క్రమంలో రైతులకు అవసరమైన యూరి యా ప్రస్తుతం లభించకపోవడంతో ముం దుగా తెచ్చుకొని స్టాకు పెట్టుకున్న రైతుల వద్దకు వెళ్లి యూరియా బదులివ్వమంటూ అడిగి తెచ్చుకుంటున్నారు. కేసముద్రం మం డలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన ఎస్సల్ల అనిల్ కూడా తన సోదరుడి వద్ద గురువారం ఒక బస్తా యూరియా బదులు తీసు కెళ్తున్న దృశ్యం ‘విజయక్రాంతి’ ప్రతినిధి కెమెరాకు చిక్కింది. 

గజ్వేల్‌లో బీఆర్‌ఎస్ నాయకుల రాస్తారోకో 

గజ్వేల్/నంగునూరు: రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయలేని స్థితిలో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు అసమర్థ పాలన సాగిస్తున్నాయని బీఆర్‌ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. గురువారం గజ్వేల్‌లో రైతులతో కలిసి గజ్వేల్ చౌరస్తాలో రాస్తారోకో చేసి ని రసన వ్యక్తం చేశా రు. వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు అధికారులను బెదిరించి యూరియా టోకె న్లు పొంది బ్లాక్‌లో అమ్ముకుంటున్నారని ఆ రోపించారు.

రైతులు పొలం పనులు మా నుకొని యూరియా కోసం గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. సరిపడేలా యూరియా సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో శనివారం వేల మంది రైతులతో దిమ్మనగూడ వద్ద రాజీవ్ రహదారిపై వంటావా ర్పు, రాస్తారోకో చేస్తామన్నారు. 

పోలీసుల సమక్షంలో పంపిణీ

సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకుల పీఏసీఎస్ వద్ద యూరియా పంపిణీ జరుగుతుందనే సమాచారంతో పె ద్ద సంఖ్యలో రైతులు అక్కడికి చేరుకున్నారు. పరిస్థితి అదుపు తప్పేలా ఉండటంతో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బందోబస్తు ఏర్పాటు చేసి పంపిణీని పర్యవేక్షించారు.