15-08-2025 01:37:20 AM
ఆకస్మిక వరదలతో విరిగిపడ్డ కొండచరియలు
హిమాచల్‌లోనూ వరణుడి ప్రతాపం
న్యూఢిల్లీ, ఆగస్టు 14: జమ్మూకశ్మీర్‌లోని కిష్తావర్‌లో గురువారం భారీ క్లౌడ్ బరస్ట్ చో టు చేసుకుంది. ఈ క్లౌడ్ బరస్ట్ ధాటికి కురిసిన భారీ వర్షానికి జమ్మూకశ్మీర్‌లోని కిష్తా వర్‌లో ఆకస్మిక వరదలు సంభవించి.. పెను విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు సీఐఎస్‌ఎఫ్ సిబ్బందితో కలిపి 4౬ మంది మృతి చెందారు. మరో 220 మంది పౌరులు గల్లంతయ్యారు. ఆకస్మిక వరదల కారణంగా ‘మా చైల్ మాత యాత్ర’ మార్గంలో భీతావహ పరిస్థితులు నెలకొన్నాయి.
యాత్రా మార్గం లో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు జవాన్లు గల్లంతయ్యారు. దీంతో మాచైల్ మాతా యాత్రను అధికారులు నిలిపివేశారు. వరదల విషయం తెలిసిన వెంట నే రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ‘చోసిటీలో క్లౌడ్ బరస్ట్‌తో భారీగా ప్రాణనష్టం చోటు చేసుకునే ప్రమాదం ఉంది.
విషయం తెలిసిన వెంటనే అధికారులు రంగంలోకి దిగారు. రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తాం’ అని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. మెరుపు వరదలకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిచ్చాయి. క్లౌడ్ బరస్ట్, ఆకస్మిక వరదలపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌లో స్పందించారు.
క్లౌడ్ బరస్ట్ బాధాకరం: రాష్ట్రపతి ముర్ము
జమ్మూకశ్మీర్‌లో క్లౌడ్ బరస్ట్ వల్ల అనేక మంది మరణించడం బాధాకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. సహాయక చర్యలు ఎటువంటి ఆటం కం లేకుండా కొనసాగాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను.
పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాం: ప్రధాని మోదీ
క్లౌడ్ బరస్ట్, ఆకస్మిక వరదల వల్ల కిష్తావర్‌లో నష్టపోయిన వారు త్వరగా కోలుకోవాలి. అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సహాయక, రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. అవసరం అయిన ప్రతి ఒక్కరికీ సహాయం అందిస్తాం
లెఫ్టినెంట్ గవర్నర్‌తో మాట్లాడా: హోం మంత్రి అమిత్ షా
క్లౌడ్ బరస్ట్ పరిస్థితులపై జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్, ముఖ్యమంత్రితో మాట్లా డా. స్థానిక యంత్రాంగం సహాయక చర్యలు చేపడుతోంది. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాం. ప్రజలకు అవసరం అయిన అన్ని రకాల సహాయ, సహకారాలు అందిస్తాం.
హోం మంత్రికి పరిస్థితి వివరించా: జమ్మూ ముఖ్యమంత్రి
క్లౌడ్ బరస్ట్, ఆకస్మిక వరదల కారణంగా కిష్త్వార్ పాంతంలో నెలకొన్న పరిస్థితిని కేం ద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు వివరించినట్టు జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. ప్రభావిత ప్రాంతాల నుంచి సమాచారం ఆలస్యంగా అందుతోందన్నారు. రాష్ట్రంతో పాటు బయట ఉన్న సాధ్యమైన అన్ని రకాల వనరులను సమీకరిస్తున్నట్టు తెలిపారు.
క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలి: ఎల్‌జీ మనోజ్ సిన్హా
ఈ క్లౌడ్ బరస్ట్ దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రాణాలు కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నా. పోలీస్, ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు అవసరం అయిన సహాయక చర్యలు చేపట్టాలి.
నేటి టీ పార్టీ రద్దు..
జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కీల క నిర్ణయం ప్రకటించారు. నేడు జరగాల్సిన ఎట్ హోం టీ పార్టీని రద్దు చేస్తున్నట్టు తెలిపారు. అంతే కాకుండా స్వాతంత్య్ర దినోత్స వం సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలను సైతం నిలిపివేయనున్నట్టు ఎక్స్‌లో ప్రకటించారు.