15-08-2025 12:42:17 AM
హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్
ఆదిలాబాద్, ఆగస్టు 14 (విజయక్రాంతి ): ప్రపంచ దేశాలకు మన భారత దేశం నాయకత్వం వహించే విధంగా ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం పయనిస్తోందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఇటీవల ఆపరేషన్ సింధూర్ విజయవంతానికి సూచికగా గ్రామ గ్రామాన పండగ వాతావరణంలో తిరంగా ర్యాలీ జరుపుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో హార్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలో గురువారం భారీ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు బ్రహ్మానం ద్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు, విద్యార్థులు పట్టణ ప్రముఖులతో కలిసి ఎమ్మెల్యే జాతీయ జెండాను చేత పట్టుకొని పట్టణ పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ప్రజల్లో దేశభక్తి చాటేల విద్యార్థిలు దేశ భక్తి నినాదాలతో హోరెత్తించారు.
అనంతరం అంబేద్కర్ చౌక్‌లో ఎమ్మెల్యే మాట్లా డుతూ...అపరేషన్ సిందూర్ తర్వాత ప్రపంచానికి భారతదేశ సైనిక శక్తి సామర్థ్యాన్ని చెప్పడం జరిగిందన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు లాలా మున్నా, ప్రవీణ్, వేద వ్యాస్, దినేష్ మాటోలియా, ధోని జ్యోతి, ముకుందరావు, మహేందర్, కృష్ణ యాదవ్, మురళీధర్‌ఠాక్రే పాల్గొన్నారు.