04-01-2026 11:46:43 AM
పాలమూరుకు మరణశాసనం రాసిందే కాంగ్రెస్ పార్టీ
ఉత్తమ్ కట్టుకథలు, రేవంత్ పిట్ట కథలు
హైదరాబాద్: తెలంగాణ భవన్ లో హరీష్ రావు కృష్ణా జలాలపై పవన్ పాయింట్ ప్రజెంటేషన్(Harish Rao Powerpoint Presentation) ప్రారంభించారు. కృష్ణా జలాల కేటాయింపు, తెలంగాణ ప్రాజెక్టులపై పీపీటీ ఇస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి కట్టుకథలు, పిట్టకథలు చెప్పారని హరీశ్ రావు ఆరోపించారు. రాజకీయాల కోసం తాము పీపీటీ ఇవ్వడం లేదన్నారు. ఫజల్ అలీ కమిషన్ చెప్పిన వినకుండా ఆంధ్రాలో కలిపి తెలంగాణకు ద్రోహం చేశారని తెలిపారు. పాలమూరుకు మరణశాసనం రాసింది కాంగ్రెస్ పార్టీనే అన్నారు. విభజన సమయంలోనూ కాంగ్రెస్ పార్టీ మనకు అన్యాయం చేసిందని హరీశ్ రావు ద్వజమెత్తారు.
11వ షెడ్యూల్ లో పాలమూరు-రంగారెడ్డి పెట్టలేదన్నారు. రూ. 200 కోట్లు ఖర్చు చేస్తే.. కాళేశ్వరం కింద 5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వొచ్చన్నారు. సొంత ప్రాంతానికే రేవంత్ రెడ్డి ద్రోహం చేస్తున్నారని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పారని ఆయన ఆరోపించారు. ఫస్ట్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లోనే కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుపై తాము ప్రశ్నించామని, పాలమూరు , డిండిని మేం కొనసాగిస్తామని కేసీఆర్ చెప్పారని తెలిపారు. టెలీమెట్రీలను పెట్టాలని 2016లోనే కేసీఆర్ చెప్పారని తెలిపారు. మోకాలు, బోడిగుండుకు ముడిపెట్టేలా రేవంత్ రెడ్డి మాటలున్నాయని హరీశ్ రావు చమత్కరించారు.