04-01-2026 10:24:35 AM
కేసముద్రం (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం (స్టే) ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయిని ఉగాది వేలంగిని మేరి గురు చైతన్య ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించి వేలంగిని మేరీ టీచర్ కు అవార్డు అందించి సత్కరించారు. గురు చైతన్య ఉపాధ్యాయ సంఘం (సౌత్ ఇండియా) ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి సత్కరించారు.