10-12-2025 09:45:27 AM
రేవంత్ రెడ్డి చోర్
హైదరాబాద్: పెట్టుబడుల కట్టకథలు చెప్పి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) రూ. కోట్లు ఖర్చు చేశారని మాజీ మంత్రి హరీశ్ రావు(Former Minister Harish Rao) ఆరోపించారు. పెట్టుబడుల పేరుతో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్(Telangana Rising Global Summit)ను అట్టర్ ఫ్లాప్ చేశారని ఆయన తెలిపారు. విజన్ డాక్యుమెంట్ లో విజన్ లేదు.. విషన్ లేదని విమర్శించారు. విజన్ డాక్యుమెంట్ కాదు.. విజన్ లెస్ డాక్యుమెంట్ అన్నారు. క్యూర్, ప్యూర్, రేర్ అంటూ తెలంగాణను కొల్లగొడుతున్న చోర్ రేవంత్ రెడ్డి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. గ్లోబల్ సమ్మిట్(Global Summit)లో ఎంవోయూల వెనుక చీకటి ఒప్పందాలు జరిగాయని, కోట్లాది రూపాయలు దండుకునే పథకాన్ని రేవంత్ రెడ్డి గ్లోబల్ సమిట్ లో ఘనంగా అమలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అంబానీలు, ఆదానీలు దేశాన్ని దోచుకుంటున్నారని రాహుల్ గాంధీ చెబుతుంటే, రాహుల్ దగ్గర ఉద్యోగం చేస్తున్నాను అని చెప్పుకునే రేవంత్ రెడ్డి(Revanth Reddy) మాత్రం అంబానీ, ఆదానీలకు తెలంగాణను అమ్మేస్తున్నడాని ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఆలోచనలు పక్కన బెట్టి అదానీ, అంబానీ ప్రతినిధులకు రేవంత్ ఎర్ర తివాచీ పరచడంలో ఆంతర్యం ఏమిటీ ?, విమర్శలు రావడంతో గతంలో అదానీ ఇచ్చిన వందకోట్ల రూపాయల విరాళం చెక్కును వెనక్కు పంపి గ్లోబల్ సమిట్ ప్రారంభ కార్యక్రమంలో అదానీ కుమారుడు కరణ్ అదానీతో ఒప్పందాలు ఎలా చేసుకున్నారు? అని హరీశ్ రావు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్, కాంగ్రెస్ ముఖ్య నేతల బినామీలతోనే ఒప్పందాలు జరిగాయన్నారు. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో బయటపెడుతామని తెలిపారు. గుజరాత్ సమ్మిట్ అయినా, కేరళ సమ్మిట్ అయినా, కర్ణాటక సమ్మిట్, వెస్ట్ బెంగాల్ సమ్మిట్ అయినా గతంలో పీఆర్ స్టంట్లు అని కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలే కాబట్టే, రేవంత్ గ్లోబల్ సమ్మిట్ పీఆర్ స్టంట్ గా భావించి రాహుల్, ప్రియాంక, ఖార్గేలు ముఖం చాటేసారని సూచించారు.
కాంగ్రెస్ నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ లో బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్(Former British Prime Minister Tony Blair) పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన రికార్డు స్థాయి అభివృద్ధి, తెలంగాణ ఒక మాడల్ అంటూ పొగడ్తలు కురిపించారని హరీశ్ అన్నారు. అదే వేదిక నుండి ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు కేసీఆర్ పాలనలో వృద్ధిరేటులో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని ప్రశంసించారు. కేసీఆర్ పదేళ్ళ పాలన గురించి, తెలంగాణ అభివృద్ధి గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడే రేవంత్ రెడ్డి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో అంటూ హరీశ్ హెచ్చరించారు.