calender_icon.png 10 December, 2025 | 8:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామాలలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్

10-12-2025 07:34:50 AM

మోతె,(విజయక్రాంతి): పంచాయతీ ఎన్నికలు(Panchayat Elections) శాంతియుతంగా, స్వేచ్ఛ వాతవరణంలో సాగేందుకోసం ఎస్సీ నరసింహ ఆదేశాల మేరకు మునగాల సీఐ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని నరసింహపురం, రావిపహాడ్, సిరికొండ గ్రామాలలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ (కవాతు) నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ  మాట్లాడుతూ... గ్రామపంచాయతీ ఎన్నికలు పూర్తిగా శాంతియుత వాతావరణంలో జరగడానికి పూర్తిస్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిరంతర పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అందరూ స్వచ్ఛందంగా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఏలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరిగినా, సామాన్య ప్రజలకు ఇబ్బందులు ఏర్పడిన డయిల్ 100 కి. ఫోన్ చేయగలరని తెలిపారు. అలాగే ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా సాగేందుకు ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో  మోతే ఎస్సై అజయ్ కుమార్, మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్ నడిగూడెం ఎస్సై అజయ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.